Kurnool: కర్నూలు వృత్తి విద్యా కళాశాలలో గురుదేవోభవ అవార్డులు!
Kurnool: ఉపాధ్యాయ దినోత్సవం వేళ కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల అధ్యాపకులకు ‘గురుదేవోభవ అవార్డు-2026’ ప్రదానం. ప్రిన్సిపాల్ నాగస్వామి నాయక్ హర్షం.
Kurnool: కర్నూలు వృత్తి విద్యా కళాశాలలో గురుదేవోభవ అవార్డులు!
Kurnool: డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా విశాఖపట్నంలోని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మెమోరియల్ ఆర్గనైజేషన్ వారు బోధనా రంగంలో అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తిస్తూ ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు
గురుదేవోభవ అవార్డు–2026”**ను ప్రకటించిన నేపథ్యంలో అవార్డు గ్రహీతలను కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మరియు NSS P.O. డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని, విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు, క్రమశిక్షణ, నైపుణ్యాలను అందించడంలో ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
బోధనా రంగంలో ఉత్తమ సేవలకు గుర్తింపుగా “గురుదేవోభవ అవార్డు–2026” లభించడం కళాశాల అధ్యాపకుల సేవలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని, ఈ అవార్డులు మరింత బాధ్యతతో పనిచేయడానికి స్ఫూర్తినిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మల్లికార్జున, విజయశేఖర్, కృష్ణమోహన్, రామకృష్ణ, సోమేశ్, ఉల్గోజి రావు, సారధి పటేల్, చిన్న మల్లేష్, శ్రీధర్ మూర్తి, బాలు, ఇంతియాజ్, వాణి ప్రసన్న, జబీన్ అక్తర్, గిరిజారాణి, సుజాత, సాయి శ్రావణి, జసింత, లావణ్యతో పాటు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అధ్యాపకుల సేవలను గుర్తించి సన్మానించడం ద్వారా కళాశాలలో గురు-శిష్య సంబంధాల విలువను చాటిచెప్పారు.




