Kurnool: గూడూరులో తెల్లవారుజామున చైన్ స్నాచింగ్ కలకలం
Kurnool: కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలోని గోట్ల వీధిలో తెల్లవారుజామున దారుణం జరిగింది.
Kurnool: గూడూరులో తెల్లవారుజామున చైన్ స్నాచింగ్ కలకలం
Kurnool: కర్నూలు జిల్లా గూడూరు పట్టణంలో గురువారం తెల్లవారుజామున చైన్ స్నాచింగ్ ఉదంతం చోటుచేసుకుంది. స్థానిక గోట్ల వీధిలో నివాసముంటున్న పద్మావతి అనే మహిళను లక్ష్యంగా చేసుకుని ఓ గుర్తుతెలియని ఆగంతకుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.రోజువారీ అలవాటులో భాగంగా పద్మావతి అనే మహిళ తెల్లవారుజామున ఇంటి ముందు కల్లాపు చల్లడానికి బయటకు వచ్చింది.
ఆ సమయంలో అక్కడ కాపుగాసి ఉన్న గుర్తుతెలియని దుండగుడు ఆమెపై ఒక్కసారిగా దాడి చేసి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు గట్టిగా ప్రతిఘటించడంతో ఇరువురి మధ్య పెనుగులాట జరిగింది. ఈ క్రమంలో దుండగుడు పద్మావతిని కిందకు నెట్టేసి, ఆమె మెడలో ఉన్న దాదాపు 35 గ్రాముల బరువున్న బంగారు చైన్‌ను బలవంతంగా తెంచుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
బాధితురాలి కేకలు విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ దొంగతనం దృశ్యాలన్నీ స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలలో రికార్డయ్యాయి. కాగా, బాధితురాలి బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.




