Nandavaram: పేరుకే ఆదర్శ పాఠశాల.. చదువు చెప్పే వారే కరువయ్యారు!

Nandavaram: కర్నూలు జిల్లా నందవరం మండలం హాలహర్వి హైస్కూల్‌లో తీవ్ర ఉపాధ్యాయుల కొరత.

S Khaleel, Yemmiganur
Published on: 27 Jun 2026 4:40 PM IST
Nandavaram
X

Nandavaram: పేరుకే ఆదర్శ పాఠశాల.. చదువు చెప్పే వారే కరువయ్యారు!

నందవరం: కర్నూలు జిల్లా నందవరం మండలం హాలహర్వి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత విద్యార్థులకు శాపంగా మారింది.

ప్రభుత్వం ఆరు మంది ఉపాధ్యాయులను కేటాయించినప్పటికీ ప్రస్తుతం విధుల్లో ఒక్కరే కొనసాగుతున్నారు.

దీంతో విద్యార్థులకు బోధన సక్రమంగా జరగక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్కూల్ ప్రారంభమై 25 రోజులు కావస్తున్నా ఉపాధ్యాయులు రాలేదని దింతో పాఠశాల లో ఉన్న 151 మంది విద్యార్థులు బోధన చేసే వారే కరువయ్యారు.

పేరుకే ఆదర్శ పాఠశాల అని అదనపు తరగతి గదులు పూర్తికాక నిలిచి పోయాయని,ఉపాధ్యాలు లేకపోవడంతో కొంతమంది తల్లిదండ్రులు విద్యార్థుల పాఠశాల మాన్పించి పొలం పనులకు తీసుకెళ్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు.

ప్రభుత్వం వెంటనే మిగిలిన ఐదుగురు ఉపాధ్యాయులను నియమించాలని,నిలిచిపోయిన తరగతి గదులు నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

S Khaleel, Yemmiganur

S Khaleel, Yemmiganur

Next Story