Kurnool: గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు - ట్రాఫిక్ మళ్లింపు
Kurnool: కర్నూలులో సెప్టెంబర్ 22న గణేష్ నిమజ్జనం సందర్భంగా 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు. నగరంలో ట్రాఫిక్ మళ్లింపు వివరాలు.
Kurnool: గణేష్ నిమజ్జనానికి భారీ బందోబస్తు - ట్రాఫిక్ మళ్లింపు
కర్నూలు: కర్నూలులో సుమారు 1,500 గణేష్ విగ్రహాల నిమజ్జనం సంధర్భంగా (మంగళవారం) సెప్టెంబర్ 22 న జిల్లా పోలీసుశాఖ కట్టుదిట్టమైన భారీ భద్రతా చర్యలు చేపట్టిందని, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు ఆదివారం తెలిపారు.
బందోబస్తు విధులలో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, 16 మంది డిఎస్పీలు, 85 మంది సిఐలు మరియు ఆర్ ఐలు , 150 మంది ఎస్సైలు, మొత్తం 2 వేల మంది పోలీసులను మోహరింపజేశామన్నారు.
ఎవరికీ అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ గారు జిల్లా ప్రజలకు , గణేష్ ఉత్సవ విగ్రహా నిర్వహకులకు ఈ క్రింది సూచనలు, సలహాలు తెలియజేశారు.
* విగ్రహాల నిర్వహకులు సమయపాలన పాటిస్తూ విగ్రహాల ఊరేగింపుకు అవసరమైన వాహానాలను, క్రేన్ల ను సిధ్దంగా ఉంచుకోవాలన్నారు.
* విగ్రహాల ఊరేగింపు వాహనాల పై చిన్నపిల్లలు ఉండకుండా ప్రమాదాల బారిన పడకుండా చూసుకోవాలన్నారు.
* నిమజ్జన సమయంలో ఘాట్ల వద్ద , ఈత రాని వారిని, చిన్న పిల్లలు, మహిళలను దూరంగా ఉంచాలన్నారు.
* ఊరేగింపులో వినాయక విగ్రహాలు తరలించే సమయంలో కరెంటు తీగలు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
* అల్లరి మూకల పై గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు.
* ఇతరుల మనోభావాలను గౌరవించాలన్నారు.
* హోరెత్తించే డిజేలతో యువత మద్యం సేవించి అత్యుత్సాహం ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
* ఎవరైనా మద్యం అనధికారికంగా విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఇతరులకు ఇబ్బందులు కలిగించకూడదన్నారు.
* బాంబు డిస్పోజబుల్, డాగ్ స్క్వాడ్ బృందాలతో విస్తృత తనిఖీలు చేస్తున్నామన్నారు.
* అనుమానిత వస్తువులు గాని, వ్యక్తులు గాని తారసపడితే డయల్ 112 లేదా డయల్ 100 కు గాని, స్ధానిక పోలీసులకు గాని ప్రజలు సమాచారం అందించాలన్నారు.
నిమజ్జనం సంధర్బంగా సెప్టెంబర్ 22 న కర్నూలు నగరంలో ట్రాఫిక్ మళ్ళింపు
వాహనచోదకులు, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సహాకరించాలన్నారు.
గణేష్ నిమజ్జనం సంధర్బంగా సెప్టెంబర్ 22 వ తేది మంగళవారం ఉదయం 10 గంటల నుంచి గణేష్ నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు నగరంలో ట్రాఫిక్ ను మళ్లించినట్లు కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు తెలిపారు.
అత్యవసర ( 108, ఫైర్ , అంబులెన్సులు, పోలీసు వాహనాలు) సేవల కోసం పోలీసు వారితో అనుమతి పొందిన వాహనాలు మాత్రమే నిమజ్జన మార్గంలో అనుమతిస్తారు.
1) కర్నూలు ఆర్టీసి బస్టాండ్ నుండి రాజ్ విహార్ సెంటర్, గవర్నమెంట్ హాస్పిటల్, వినాయక్ ఘాట్, గాయత్రి ఎస్టేట్ వరకు ఎటువంటి వాహనాలకు అనుమతి ఉండదు. వాహనాల రాక, పోకల నిషేధం ఉంటుంది.
2) కర్నూలు ఆర్టీసి బస్టాండ్ నుండి ఆర్టీసి బస్సులు, ఇతర వాహనాలను బళ్ళారి చౌరస్తా మీదుగా కల్లూరు చెన్నమ్మ సర్కిల్, గుత్తి పెట్రోల్ బంక్ , బిర్లా జంక్షన్ , మద్దూర్ నగర్ సర్కిల్ , సి. క్యాంపు మీదుగా నంద్యాల చెక్ పోస్టు వైపు వాహనాల రాక, పోకలు ఉంటాయి.
3) ఆత్మకూరు, నంద్యాల, నందికోట్కూరు, నంద్యాల చెక్ పోస్టు వైపు నుండి నగరంలోనికి వచ్చే వాహనాలు సి. క్యాంపు, బిర్లాగేట్ , గుత్తి పెట్రోల్ బంక్ నుండి కల్లూరు చెన్నమ్మ సర్కిల్ , బళ్ళారి చౌరస్తా మీదుగా కర్నూలు RTC బస్టాండ్ కు చేరుకుంటాయి.
4) హైదరాబాద్, గద్వాల, అలంపూర్ నుండి వచ్చే వాహనాలు తుంగభద్ర బ్రిడ్జి , సంతోష్ నగర్, బళ్ళారి చౌరస్తా మీదుగా కర్నూలు RTC బస్టాండుకు చేరుకుంటాయి.
5) అనంతపురం, డోన్ నుండి వచ్చే వాహనాలు గుత్తి పెట్రోల్ బంకు, బళ్ళారి చౌరస్తా మీదుగా కర్నూలు RTC బస్టాండ్ చేరుకుంటాయి.
నిమజ్జనం పూర్తయిన తర్వాత నిమజ్జన వాహనాలు దేవనగర్ మీదుగా కృష్ణ నగర్ & కల్లూరు బ్రిడ్జి మీదుగా బయటకు వెళతాయి.
కెసి కెనాల్ వైపు వెళ్లే డిజే వాహనాలు మళ్ళింపు
* రాజ్‌విహార్ వైపు నుండి వచ్చే డిజే వాహనాలను ఎన్టీఆర్ సర్కిల్ / కలెక్టరేట్ సర్కిల్ వద్ద ఆపి , వెనుకకు మళ్లించబడును.
* నంద్యాల చెక్‌పోస్ట్ వైపు నుండి వచ్చే డిజే వాహనాలను మద్దూర్ నగర్ మసీదు వద్ద ఆపి, వెనుకకు మళ్లించబడును.
* చెన్నమ్మ సర్కిల్, షరీన్ నగర్, బళ్లారి చౌరస్తా వైపు నుండి వచ్చే డిజే వాహనాలను బిర్లా గేట్ వద్ద ఆపి, వెనుకకు మళ్లించబడును.
హెచ్‌ఎన్‌ఎస్ కెనాల్ వైపు వెళ్లే డిజే వాహనాలు మళ్ళింపు
* సి. క్యాంపు వైపు నుండి నంద్యాల చెక్ పోస్టు మీదుగా వెళ్ళే డిజే వాహనాలను , నంద్యాల చెక్ పోస్టు వద్ద ఆపి, వెనకకు మళ్ళించబడును.
* బళ్లారి చౌరస్తా, సంతోష్ నగర్ వైపు నుండి వచ్చే డిజే వాహనాలను కేశవ్ గ్రాండ్ హోటల్ సమీపంలో ఆపి, వెనుకకు మళ్లించబడును.
* గుత్తి పెట్రోల్ బంక్ మీదుగా వచ్చే డిజే వాహనాలను గుత్తి పెట్రోల్ బంక్ వద్ద ఆపి, వెనుకకు మళ్లించబడును.
* నిమజ్జన రూట్లలల్లో అధిక సంఖ్యలో ఆసుపత్రులు ఉన్నందున రోగులు మరియు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని డిజే వాహనాల నియంత్రణ, మళ్ళింపు చేయబడిందని, గణేష్ ఉత్సవ నిర్వహకులు, ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సహకరించవలెను.
జిల్లా ప్రజలు, మతపెద్దలు, రాజకీయ పార్టీలు, యువత , మిడియా కర్నూలులో నిమజ్జన ఉత్సవ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు సహాయ సహాకారాలు అందించాలని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ విజ్ఞప్తి చేశారు.




