Kurnool: హోల్లగుంద మండలం హెబ్బటం, లింగంపల్లిలో గోవింద్ గౌడ్ ప్రచారం!

Kurnool: కర్నూలు జిల్లా హోల్లగుంద మండలం హెబ్బటం, లింగంపల్లి గ్రామాల్లో స్వతంత్ర జడ్పీటీసీ అభ్యర్థి ఈడిగ గోవింద్ గౌడ్ ఇంటింటి ప్రచారం. ఏసీ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి.

Bheemalinga, Aluru
Published on: 3 Nov 2026 11:59 AM IST
Kurnool
X

Kurnool: హోల్లగుంద మండలం హెబ్బటం, లింగంపల్లిలో గోవింద్ గౌడ్ ప్రచారం!

Kurnool: కర్నూలు జిల్లా హోల్లగుంద మండలం హెబ్బటం, లింగంపల్లి గ్రామాల్లో స్వతంత్ర అభ్యర్థి ఈడిగ గోవింద్ గౌడ్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

హోల్లగుందా జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గోవింద్ గౌడ్ తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేపట్టారు.

ఈ సందర్భంగా గ్రామాల్లోని ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, తనకు ఒక అవకాశం కల్పించి ఏసీ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం, నాయకులతో ఉన్న పరిచయాలు మండల అభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి సహకరిస్తాయని గోవింద్ గౌడ్ తెలిపారు.

ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్న తనకు ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉందని, మరోసారి పోటీ చేసే ఉద్దేశం లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

గ్రామాల అభివృద్ధి కోసం తనను ఆదరించి, ఏసీ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతూ ప్రచారం నిర్వహించారు.

Bheemalinga, Aluru

Bheemalinga, Aluru