Kurnool: కర్నూలు జనసేన కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ!
Kurnool: కర్నూలు జనసేన ఆఫీస్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ చింత సురేష్ బాబు.
Kurnool: కర్నూలు జనసేన కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ!
Kurnool: 80వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు కర్నూలు జిల్లా జనసేన పార్టీ ఆఫీస్ లో ఘనంగా నిర్వహించారు.80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ కో ఆర్డినేటర్ చింత సురేష్ బాబు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ సభ్యుడు మంజునాథ్,శాలివాహన కార్పొరేషన్ సభ్యుడు సుబ్బయ్య,జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
80 సంవత్సరాల స్వతంత్రలో దేశం అభివృద్ధి దిశగా వెళ్తుందని ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలుస్తుందని,ప్రపంచంలోని దేశాల్లో ఎక్కడి వెళ్ళినా మన దేశ విజ్ఞానులు భారత దేశ ఖ్యాతిని ముందుకు తీసుకెళ్తున్నారని, దేశంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు తమ హక్కులతోపాటు బాధ్యతగా ఉండాలని, ప్రతి ఒక్కరు దేశం పట్ల బాధ్యతగా ఉంటే మన దేశం నెంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని చింత సురేష్ బాబు తెలిపారు.




