Kurnool: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే భారీ జరిమానాలు.. టాస్క్ ఫోర్స్ కమిటీలు రెడీ!

Kurnool: కర్నూలు జిల్లాను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 April 2026 11:01 AM IST
Kurnool
X

Kurnool: సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడితే భారీ జరిమానాలు.. టాస్క్ ఫోర్స్ కమిటీలు రెడీ!

కర్నూలు: కర్నూలు జిల్లాను "సింగిల్ యూజ్ ప్లాస్టిక్" రహిత నగరంగా మారుద్దాం అని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ తెలిపారు.

గురువారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలన అంశం పై జాయింట్ కలెక్టర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని అత్యంత కఠినంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నగరంలో ప్లాస్టిక్ నిషేధాన్ని పర్యవేక్షించడానికి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ULB స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నెలలో 2 సార్లు ఖచ్చితంగా అన్ని షాపులను తనిఖీ చేయడంతో పాటు, నిషేధిత ప్లాస్టిక్ అమ్మే వ్యాపారులపై దాడులు నిర్వహించి, ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకోవడంతో పాటు భారీగా జరిమానాలు విధించాలని ఆదేశించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జాయింట్ కలెక్టర్ కోరారు. డప్పు కళాకారులు, సంగీత ప్రదర్శనలు, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ల ద్వారా ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాల గురించి వివరించి ప్రజలను చైతన్యపరచాలన్నారు. స్వయం సహాయక బృందాల ద్వారా పర్యావరణ హితమైన సంచుల విక్రయ మేళాలను పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు.

సమావేశంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story