Kurnool: కర్నూలులో లారీ బీభత్సం 60 గొర్రెలు, ఇద్దరు యువకులు బలి!
Kurnool: కర్నూలు జిల్లా జోన్నగిరి సమీపంలో లారీ బీభత్సం. బ్రేకులు ఫెయిలై 60 గొర్రెలను బలితీసుకుని, ఇద్దరు యువకులను ఢీకొట్టిన ప్రమాదం. ఇద్దరూ మృతి.
Kurnool: కర్నూలులో లారీ బీభత్సం 60 గొర్రెలు, ఇద్దరు యువకులు బలి!
Kurnool: కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పత్తికొండ నుంచి గుజిరి లోడుతో వెళ్తున్న లారీ, పగిరాయి వైపు నుంచి బైక్‌పై వస్తున్న ఇద్దరు యువకులను ఢీకొట్టింది. యువకులు చికిత్స పొందుతూ మృతి చెందారు. అదే లారీ నాలుగు గంటల ముందు బ్రేకులు ఫెయిల్ అయి గొర్రెల మందపైకి దూసుకెళ్లి 60 గొర్రెలను బలితీసుకుంది.
ఘటనలో మృతి చెందిన యువకులు మదనంతపురంకి చెందిన బాలరాజు, మహేంద్రగా గుర్తించారు. మృతులో మహేంద్రకు నూతనంగా వివాహాం కావడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే రోజు రెండు విషాద ఘటనలు జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. 60 గొర్రెలు మృతి చెందడంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురైయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story




