Kurnool: కల్లూరు టీడీపీ నేతలతో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి భేటీ!

Kurnool: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కర్నూలు మాధవి నగర్ క్యాంపు కార్యాలయంలో కల్లూరు మండల టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి, గౌరు వెంకట రెడ్డి సమావేశమయ్యారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 12 Nov 2026 6:34 PM IST
Kurnool
X

Kurnool: కల్లూరు టీడీపీ నేతలతో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి భేటీ!

కర్నూలు: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కల్లూరు మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులతో మాధవి నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు శ్రీ గౌరు వెంకట రెడ్డి పాల్గొని నాయకులతో ఎన్నికల సన్నద్ధత, గ్రామాల వారీగా పార్టీ పరిస్థితులు, అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు. గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ఎన్నికల ప్రక్రియలో ముందుకు సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL