Kurnool: ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన SMC సభ్యులకు అభినందనలు

Kurnool: కర్నూలు జిల్లాలో ఏకగ్రీవంగా ఎన్నికైన SMC సభ్యులకు అభినందనలు. విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 29 Sept 2026 4:00 PM IST
Kurnool
X

Kurnool: ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన SMC సభ్యులకు అభినందనలు

కర్నూలు: కర్నూలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన పాఠశాల నిర్వహణ కమిటీ (SMC) ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీపై నమ్మకంతో టీడీపీ మద్దతుదారులను ఏకగ్రీవంగా ఎన్నుకున్న తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మరియు స్థానిక ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు.

అలాగే, జిల్లాలోని వివిధ నియోజకవర్గాలు, గ్రామాలు మరియు పట్టణ పాఠశాలల్లో SMC చైర్మన్లు, వైస్ చైర్మన్లు మరియు కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు.

కృష్ణమ్మ మాట్లాడుతూ పాఠశాలల పురోగతిలోనే మన పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన మౌలిక వసతులు, మరియు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడంలో SMC సభ్యుల పాత్ర అత్యంత కీలకమైనది. ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులతో సమన్వయం చేసుకుంటూ, మన ప్రభుత్వ లక్యాలకు అనుగుణంగా పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను."

అధికారాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి, విద్యా వ్యవస్థ బలోపేతానికి, మన విద్యార్థుల ఉజ్జ్వల భవిష్యత్తుకు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులందరూ సమర్థవంతంగా పనిచేస్తారని ఆశిస్తూ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL