Kurnool: విద్యుత్ ఉద్యమ అమరులకు వామపక్ష నేతల ఘన నివాళి

Kurnool: కర్నూలులో 2000 విద్యుత్ ఉద్యమ అమరులు విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణల చిత్రపటాలకు వామపక్ష నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 28 Aug 2026 7:44 PM IST
Kurnool
X

Kurnool: విద్యుత్ ఉద్యమ అమరులకు వామపక్ష నేతల ఘన నివాళి

కర్నూలు: 2000 సంవత్సరంలో విద్యుత్ ఉద్యమంలో అమరులైన విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామి రామకృష్ణల కు cpi cpi ( m ) cpi లిబరేషన్ Suci పార్టీల ఆధ్వర్యంలో చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించడం మౌనం పాటించడం జరిగినది ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి వామపక్ష నాయకులు టి. రాముడు సి.మహేష్ అధ్యక్షత వహించారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే .రామాంజనేయులు సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్. సిపిఐ ml లిబరేషన్ జిల్లా నాయకులు ఎస్ఎన్ రసూల్ ఎస్ యు సి ఐ నాయకులు నాగన్న గార్లు మాట్లాడుతూ 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని ఆరోజు విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఒక సంవత్సరం పాటు ఉద్యమం ఉవ్వెత్తున జరిగిందని సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఉద్యమమని గుర్తు చేశారు.

చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించి బషీర్ బాగ్ లో వామపక్ష కార్యకర్తలపై. నాయకుల పైన విచక్షణారహితంగా లాటి చార్జి చేసి గుర్రాలతో తొక్కించి తుపాకీ తూటాలను పేల్చి ముగ్గురుని పొట్టన పెట్టుకున్న చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు.

ముగ్గురి బలిదానం వృధా కాలేదు అని ఆ స్ఫూర్తి ఇప్పటికీ కొనసాగుతుందని తెలియజేశారు.ఇప్పుడు మరీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని ఈసారి స్మార్ట్ మీటర్ల రూపంలో విద్యుత్ చార్జీలను పెంచడానికి దొడ్డి దారిన వస్తున్నారని గుర్తు చేశారు.

ఆదానీ అంబానీలకు దోచిపెట్టడానికే ఈ స్మార్ట్ మీటర్ల వ్యవహారం అని తెలియజేశారు, ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయని చాలా తక్కువ ఖర్చులోనే కేవలం ఒక రూపాయి యూనిట్ కే విద్యుత్ ఉత్పత్తి అవుతున్న ప్రజల దగ్గరకు వచ్చేపాటికి ఏడు రూపాయలు నుంచి 14 రూపాయలు యూనిట్ కట్టబెట్టి సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఉపసంహరించుకోవాలని లేదంటే మరో విద్యుత్ ఉద్యమానికి సన్నద్ధమవుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మునెప్ప నగర నాయకులు బిసన్న, అన్వర్ ,నల్లన చేశారు సి.కుమార్ విద్యార్థి నాయకులు అశోక్ సిపిఎం నగర కార్యదర్శి రాజశేఖర్ సిపిఎం జిల్లా నాయకులు ps రాధాకృష్ణ ఆనంద్ బాబు ప్రజానాట్యమండలి నాయకులు నాగరాజు జి .మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. వామపక్ష నాయకులు

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story