Kurnool: కర్నూలు వైద్యులకు ప్రశంసలు.. కలెక్టర్ అభినందనలు!
Kurnool: కర్నూలు జిల్లా వైద్య శాఖకు రాష్ట్ర స్థాయి అవార్డుల పంట. ప్రసవాల్లో ఆదోని ఆసుపత్రికి అగ్రస్థానం, కంటి ఆపరేషన్లలో ఎమ్మిగనూరు డాక్టర్ చిరంజీవి రికార్డు,
Kurnool: కర్నూలు వైద్యులకు ప్రశంసలు.. కలెక్టర్ అభినందనలు!
Kurnool: 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా ప్రసవాలు, అత్యధికంగా నవజాత శిశువులకు చికిత్స అందించి ఆదోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి అగ్రస్థానంలో ఉన్న సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్య సిబ్బంది, ఎస్.ఎన్.సి.యు (SNCU) సిబ్బందికి రాష్ట్ర సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని పంపించారు.
అలాగే 2025వ సంవత్సరంలో అత్యధికంగా 411 కంటి శుక్లాల ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసి, రికార్డు సృష్టించినందుకు ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రికి చెందిన ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్. చిరంజీవి కి రాష్ట్ర స్థాయి ప్రశంసా పతాన్ని అందచేశారు.
కోడుమూరు సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) లో 4 కేజీల బరువు గల శిశువుకు ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా అత్యంత నైపుణ్యంతో సాధారణ కాన్పు (నార్మల్ డెలివరీ) చేసినందుకు ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నాగరాజు, వారి వైద్య సిబ్బందికి కూడా ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని పంపించారు.
ప్రభుత్వ ఆసుపత్రులలో పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించిన ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు ఆసుపత్రుల వైద్యులకు, నర్సింగ్ మరియు పారామెడికల్ సిబ్బందికి కలెక్టర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కోరారు.




