Kurnool: కర్నూలులో 'హార్ట్ వాక్' అవగాహన ర్యాలీ: ఎంపీ బస్తిపాటి!
Kurnool: కర్నూలులో ప్రపంచ గుండె దినోత్సవం రాజ్ విహార్ సర్కిల్ నుంచి ధర్నా చౌక్ వరకు హార్ట్ వాక్ పాల్గొన్న ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఉచిత వైద్య శిబిరం ప్రారంభం.
Kurnool: కర్నూలులో 'హార్ట్ వాక్' అవగాహన ర్యాలీ: ఎంపీ బస్తిపాటి!
కర్నూలు: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యమని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ప్రపంచ గుండె దినోత్సవం సందర్బంగా కిమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నగరంలోని రాజ్ విహార్ సర్కిల్ నుంచి ధర్నా చౌక్ వరకు నిర్వహించిన హార్ట్ వాక్ అవగాహన ర్యాలీ ని ఆయన ప్రారంభించి, ర్యాలీలో పాల్గొన్నారు.
అనంతరం ధర్నా చౌక్ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత కార్డియాలజీ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు..ఈ సందర్బంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ ఇటీవల గుండె జబ్బులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యుల సూచనతో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వృద్ధులతో పాటు యువతలోనూ గుండె సమస్యలు పెరుగుతున్నాయాని, గుండె జబ్బుల విషయంలో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి గుండె వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.




