Kurnool: నిరుద్యోగులను నష్టపరిచింది వైసీపీనే - ఎంపీ బస్తిపాటి నాగరాజు

Kurnool: కర్నూలులో 'యువత భవితకు భరోసా' కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బస్తిపాటి నాగరాజు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్న ఎంపీ.

V RAMAMOHAN, KURNOOL
Published on: 17 Sept 2026 1:52 PM IST
Kurnool
X

Kurnool: నిరుద్యోగులను నష్టపరిచింది వైసీపీనే - ఎంపీ బస్తిపాటి నాగరాజు

కర్నూలు: గత వైసీపీ ప్రభుత్వంలో సరైన ఉద్యోగ అవకాశాలు లేక యువత తీవ్రంగా నష్టపోయారని ఎంపీ బస్తిపాటి నాగరాజు మండిపడ్డారు...నగరంలోని అబ్బాస్ నగర్ లో గల రవీంద్ర మహిళా డిగ్రీ కళాశాలలో నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా ఎంపీ నాగరాజు విద్యార్థులతో నేరుగా మాట్లాడి, ప్రభుత్వం నిరుద్యోగ యువతకు కలిపిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు.

అనంతరం ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలిపించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని, అందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుగా సాగుతున్నారన్నారు.

ఇప్పటికే సుమారు 7 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించామని, ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి, ఉపాధ్యాయ నియామక పరీక్ష కి మధ్య ఉన్న తేడా తెలియని జగన్, డిఎస్సీ పై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.. ప్రభుత్వం డిఎస్సీ నియామక ప్రక్రియను పారదర్శకంగా చేపట్టి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని ఆయన తెలిపారు.. ఈ కార్యక్రమంలో రవీంద్ర విద్యా సంస్థల అధినేత పుల్లయ్య, కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు..

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL