Kurnool: కర్నూలులో గురుపూజోత్సవం, హాజరైన ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యే చరిత!

Kurnool: కర్నూలు కలెక్టరేట్‌లో గురుపూజోత్సవ వేడుకల్లో ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యే గౌరు చరిత పాల్గొని ఉపాధ్యాయులను సన్మానించారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 5 Sept 2026 2:26 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలులో గురుపూజోత్సవం, హాజరైన ఎంపీ నాగరాజు, ఎమ్మెల్యే చరిత!

Kurnool: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు..ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపుజోత్సవంలో పాణ్యం ఎం.ఎల్.ఏ గౌరు చరిత తో కలిసి పాల్గొన్నారు..

కార్యక్రమంలో భాగంగా ముందుగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి ఎంపీ, ఎం.ఎల్.ఏ పూలమాల వేసి నివాళ్లులార్పించారు.. ఈ సందర్బంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను బోధనేతర విధులకు ఉపయోగించి తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు..

కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులను గౌరవిస్తూ, వారి సంక్షేమం తో పాటు విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తుందన్నారు.. సీ.ఎం చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేష్ లు డిఎస్సీని పారదర్శకంగా నిర్వహించి వేలాది ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడంతో పాటు, కొత్త డిఎస్సీ నోటిఫికేషన్ ను త్వరలోనే విడుదల చేయబోతున్నారన్నారు..

ఇక తల్లిదండ్రుల తర్వాత గురువు స్థానం చాలా గొప్పదని, పిల్లల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని ఎంపీ తెలిపారు.. ఈ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ, డీ.ఈ.ఓ సుధాకర్, ఆర్.ఐ.ఓ లాలప్ప తదితరులు పాల్గొన్నారు...

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story