Kodumuru: పందుల బెడద నుంచి కాపాడండి కోడుమూరు అధికారులకు రైతుల ఫిర్యాదు!
Kodumuru: ముడుములగుర్తి గ్రామంలో పందుల సంచారంతో పంటలు నాశనం. ఎంపీడీవో, పోలీసులకు రైతులు ఫిర్యాదు. తక్షణమే చర్యలు తీసుకోవాలని శ్రీనివాస రెడ్డి డిమాండ్.
Kodumuru: పందుల బెడద నుంచి కాపాడండి కోడుమూరు అధికారులకు రైతుల ఫిర్యాదు!
Kodumuru: కర్నూలు జిల్లా కోడుమూరు మండలం ముడుములగుర్తి గ్రామంలో పందుల బెడదతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పందులు పంట పొలాల్లోకి చొరబడి పంటలను నాశనం చేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ పందుల బెడద రోజురోజుకూ పెరుగుతోందని తెలిపారు.
పందులను గ్రామం నుంచి తరలించి, రైతుల పంటలకు రక్షణ కల్పించాలని కోరుతూ గ్రామస్తులు శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీవో, పోలీసులకు ఫిర్యాదు చేశారు.అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకుని పందుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Next Story




