Kurnool: కేసీ కెనాల్ స్వచ్ఛత పనులను పరిశీలించిన కమిషనర్

Kurnool: కర్నూలు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా భావించాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పిలుపునిచ్చారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 16 May 2026 6:05 PM IST
Kurnool
X

Kurnool: కేసీ కెనాల్ స్వచ్ఛత పనులను పరిశీలించిన కమిషనర్

Kurnool: నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సామాజిక బాధ్యతగా భావించాలని కమిషనర్ చల్లా ఓబులేసు పిలుపునిచ్చారు. శనివారం ఆయన అశోక్‌నగర్ వద్ద కే.సి. కెనాల్‌లో జరుగుతున్న స్వచ్ఛత పనులను పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ఉన్న నదులు అపరిశుభ్రంగా ఉంటే పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.

ప్రతిసారి శుభ్రత పనులు చేపట్టాల్సి వస్తే నగరపాలక సంస్థకు ఆర్థిక భారం పడి, లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తుందన్నారు. రూ.10 లక్షల వ్యయంతో గత వారం రోజులుగా స్వచ్ఛత పనులు చేపడుతున్నామని, ఇందుకోసం 2 హిటాచీలు, 1 జేసీబీ, 3 ట్రాక్టర్లు, 1 టిప్పర్‌తో స్వచ్ఛత పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు.

అదేవిధంగా కమిషనర్ ఎన్‌ఆర్‌పేట, ప్రకాష్‌నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. సెట్కూర్ కార్యాలయం సమీపంలో ఉన్న అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జున్, ఎంజల్ ప్రణీత తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story