Kurnool: డివైడర్లలో శుభ్రత పనులు చేపట్టాలి

Kurnool: బుధవారపేట, సి.క్యాంపులో పారిశుద్ధ్య పనుల పరిశీలన.. వర్షాకాలం ముందే డ్రైన్ల పూడికతీతకు ఆదేశం.

V RAMAMOHAN, KURNOOL
Published on: 30 May 2026 5:38 PM IST
Kurnool
X

Kurnool: డివైడర్లలో శుభ్రత పనులు చేపట్టాలి

కర్నూలు: నగరంలో రహదారులతో పాటు విభాగిణులు (డివైడర్లు), రహదారుల పక్కన ఉన్న ప్రాంతాలను సైతం శుభ్రంగా ఉంచాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. శనివారం ఆయన బుధవారపేట, సి.క్యాంపు, అమ్మ హాస్పిటల్ కూడలి ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగర సుందరీకరణకు పరిశుభ్రమైన వాతావరణం ఎంతో అవసరమన్నారు. ప్రధాన రహదారులపై ఉన్న డివైడర్లలో పెరిగిన కలుపు మొక్కలు, చెత్తాచెదారం, ఎండిన కొమ్మలను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. రోడ్ల పక్కన చెత్త పేరుకుపోకుండా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, పారిశుద్ధ్య సిబ్బంది కేటాయించిన ప్రాంతాల్లో ప్రతిరోజూ విధులు నిర్వర్తించేలా చర్యలు తీసుకోవాలని పర్యవేక్షక సిబ్బంది ఆదేశించారు.

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని కాలువలు, డ్రైన్లలో పూడిక పేరుకుపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నగరాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రజలు కూడా చెత్తను రోడ్లపై, డివైడర్లలో వేయకుండా నగర పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, శానిటేషన్ ఇంస్పెక్టర్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story