Kurnool: సమన్వయంతోనే మెరుగైన పారిశుద్ధ్యం సాధ్యం
Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Kurnool: సమన్వయంతోనే మెరుగైన పారిశుద్ధ్యం సాధ్యం
Kurnool: పారిశుద్ధ్య సిబ్బంది సమన్వయంతో పనిచేసినప్పుడే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అన్నారు. సోమవారం ఆయన రైల్వే స్టేషన్ రోడ్, రాజ్ విహార్, సి. క్యాంపు, లక్ష్మీనగర్, ఏ. క్యాంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 5వ డివిజన్ కార్యాలయంలో సిబ్బంది హాజరు పరిశీలించారు.
కార్మికులు తప్పనిసరిగా ఉదయం 05:30 గంటలకల్లా విధుల్లో హాజరవాలని, యూనిఫాం ధరించడం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పారిశుద్ధ్య కార్మికులు, కార్యదర్శులు, ఇన్‌స్పెక్టర్లు పరస్పర సమన్వయంతో పని చేయాలని, అవసరమైన సందర్భాల్లో ఇతర డివిజన్ల సిబ్బంది, విభాగాలతో సైతం సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పైనుంచి ఇచ్చిన ఆదేశాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయించడం ఇన్‌స్పెక్టర్ల బాధ్యత అని కమిషనర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్లు ఆర్.రాజు, మునిస్వామి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.




