Kurnool: కర్నూలులో అధ్వానపు రోడ్లు, డ్రైనేజీలపై కమిషనర్ చల్లా సీరియస్!

Kurnool: కర్నూలు నగరంలో అధ్వానంగా ఉన్న రహదారులు, డ్రైనేజీ కాలువలపై నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆకస్మిక తనిఖీలు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 19 Jun 2026 8:08 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలులో అధ్వానపు రోడ్లు, డ్రైనేజీలపై కమిషనర్ చల్లా సీరియస్!

కర్నూలు: నగరంలో రహదారులు, డ్రైనేజీ కాలువలు పూర్తిగా అధ్వానంగా ఉన్న ప్రాంతాల్లో అత్యవసర పనులను చేపట్టేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు ఆదేశించారు. శుక్రవారం ఆయన బుధవారపేట, హరిజనవాడ, హబీబ్ ముబారక్ నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

అనంతరం గణేష్ నగర్, మదర్ ల్యాండ్, రాంప్రియ నగర్, ధనలక్ష్మి నగర్, మారుతి మెగా సిటీ ప్రాంతాల్లో పర్యటించారు. సమస్యాత్మకంగా మారిన రహదారులు, డ్రైనేజీ కాలువలను సందర్శించి పరిష్కార మార్గాలకు ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు.

కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. మురుగు నీరు పూర్తిగా ప్రవహించని డ్రైనేజీ కాలువలు, వాహనాలు వెళ్లలేని రహదారులకు వెంటనే డబ్ల్యూబీఎం రహదారులు నిర్మించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఏవైనా సమస్యాత్మక అంశాలు ఉన్నప్పుడు అందులో సాధ్యాసాధ్యాలను పరిశీలించి, అంతవరకు తాత్కాలిక నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు.

కార్యక్రమంలో ఎస్‌ఈ రమణమూర్తి, ఎంఈ మనోహర్ రెడ్డి, సానిటేషన్ సూపర్వైజర్ రమేష్, పట్టణ ప్రణాళిక అధికారి అంజాద్ బాష, డీఈఈ నరేష్, ఏఈ జనార్ధన్, సానిటేషన్ ఇన్‌స్పెక్టర్ హుస్సేన్, బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ దివాకర్, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story