Kurnool: సీజనల్ వ్యాధులపై నగరపాలక సంస్థ స్పెషల్ ఫోకస్
Kurnool: వర్షాకాలం నేపథ్యంలో కర్నూలు నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు తెలిపారు.
Kurnool: సీజనల్ వ్యాధులపై నగరపాలక సంస్థ స్పెషల్ ఫోకస్
కర్నూలు: నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. సోమవారం ఆయన వీకర్ సెక్షన్ కాలనీ - 2 లో అబేట్ ద్రావణ పిచికారీని పరిశీలించారు. అంతకన్నాముందు బుధవారపేట వద్ద 6వ శానిటేషన్ డివిజన్ మస్టర్‌ను తనిఖీ చేశారు. కే.సి. కెనాల్, దేవనగర్, ఇందిరమ్మ కట్ట, చెన్నమ్మ సర్కిల్, ఎల్కూర్ బంగ్లాస్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అనంతరం సెట్కూర్ కార్యాలయం వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో నగరంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణ చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు తెలిపారు. లార్వా ఉత్పత్తి 39 మంది ప్రత్యేక సిబ్బంది, 10 యంత్రాలతో స్ప్రేయింగ్, ఫాగింగ్‌లను చేపడుతున్నట్లు వివరించారు. ప్రతి వీధిలో ఉదయం పూట అబేట్ ద్రావణం పిచికారీ చేస్తున్నామని,
ఈ ప్రక్రియ ప్రతి వీధిలో పది రోజులకు ఒకసారి జరుగుతుందన్నారు. మధ్యాహ్నం సాయంత్రం మలాథియాన్ ద్రావణ ఫాగింగ్ రెండు వారాలకు ఒకసారి చేపట్టడం జరుగుతుందన్నారు. లోతట్టు ప్రాంతాల్లో దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇళ్ల వద్ద నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు.
కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం.రఘు, సినియర్ ఎండమాలజిస్ట్ సత్యనారాయణ, సానిటరీ సూపర్వైజర్ రమేష్, ఇంస్పెక్టర్లు జిలానీ, ఫరూక్, అలీంబాష, తదితరులు పాల్గొన్నారు.




