Kurnool: కర్నూలులో వంతెనల వద్ద రక్షణ వలయాల ఏర్పాటు కమిషనర్!

Kurnool: కర్నూలు నగరంలో నదులు, కాలువల వంతెనల వద్ద చెత్త నివారణకు రూ.52 లక్షలతో రక్షణ వలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 30 Sept 2026 4:14 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలులో వంతెనల వద్ద రక్షణ వలయాల ఏర్పాటు కమిషనర్!

Kurnool: నగరంలో నదులపై ఉన్న వంతెనల పరిసరాల్లో పరిశుభ్రతను కాపాడేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, వంతెనల వద్ద ప్రజలు చెత్త వేయకుండా, అపరిశుభ్రతకు తావులేకుండా రక్షణ వలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. బుధవారం ఆనంద్ టాకీస్ వద్ద హంద్రీ నదిపై ఏర్పాటు చేస్తున్న రక్షణ వలయాన్ని కమిషనర్ పరిశీలించారు.

కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని ఆనంద్ టాకీస్ సమీపంలో, రాజ్ విహార్, జొహరాపురం ప్రాంతాల్లో హంద్రీ నదిపై, అశోక్ నగర్, కేవీ కళాశాల ప్రాంతాల్లో కేసీ కెనాల్‌పై ఉన్న వంతెనలకు రూ.52 లక్షలతో రక్షణ వలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ రక్షణ వలయాల ఏర్పాటుతో నదులు, కాలువలు పరిశుభ్రంగా ఉండటంతో పాటు వంతెనల వద్ద ప్రమాదాల నివారణకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

అదేవిధంగా సెట్కూరు కార్యాలయం వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. కెవి‌ఆర్ కళాశాల, స్టాంటన్‌పురం, జొహరపురం ప్రాంతాల్లో గుర్రపు డెక్క తొలగింపు పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డీఈఈ కృష్ణలత, ఏఈ మహేష్, తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL