Kurnool: కర్నూలులో ఎస్టీపీ పనులను వేగవంతం చేయాలి కమిషనర్
Kurnool: కర్నూలు జమ్మిచెట్టు వద్ద 10 MLD ఎస్టీపీ పనులను పరిశీలించిన కమిషనర్ చల్లా ఓబులేసు. పారిశుద్ధ్య పనులు, అన్న క్యాంటీన్ ను తనిఖీ చేసిన అధికారులు.
Kurnool: కర్నూలులో ఎస్టీపీ పనులను వేగవంతం చేయాలి కమిషనర్
కర్నూలు: నగరంలో నిర్మాణ దశలో ఉన్న సివెజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల (ఎస్టిపిల) పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు అధికారులను ఆదేశించారు.
సోమవారం జమ్మిచెట్టు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న 10 ఎంఎల్డీ సామర్థ్యం గల నూతన ఎస్టిపి పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని సూచించారు. అనంతరం పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, మురుగు కాలువల పూడికతీత, చెత్త సేకరణ ప్రక్రియలను కమిషనర్ పరిశీలించారు.
అదేవిధంగా కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను తనిఖీ చేశారు. కార్యక్రమంలో సానిటరీ ఇంస్పెక్టర్లు ముర్తుజా వలి, లోకేష్, తదితరులు పాల్గొన్నారు.
Next Story




