Kurnool: ఫీజు కడితే చాలు.. వెంటనే LRS అప్రూవల్!
Kurnool: కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ఎల్‌ఆర్‌ఎస్ మేళా. ఫీజు చెల్లించిన వెంటనే అప్రూవల్ కాపీలు అందజేత.
Kurnool: ఫీజు కడితే చాలు.. వెంటనే LRS అప్రూవల్!
Kurnool: అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్‌ఆర్‌ఎస్) కు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు కర్నూలు నగరపాలక సంస్థ ప్రత్యేకంగా “ఎల్‌ఆర్‌ఎస్ మేళా”ను నిర్వహిస్తున్నట్లు కమిషనర్ చల్లా ఓబులేసు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకొని ఫీ-ఇంటిమేషన్ ఉన్న దరఖాస్తుదారులు ఫీజు చెల్లించిన వెంటనే అప్రూవల్ ప్రొసీడింగ్స్ పొందవచ్చని, షార్ట్‌ఫాల్ ఉన్న వారు అవసరమైన పత్రాలు సమర్పించి, ఫీజు చెల్లించిన వెంటనే అప్రూవల్ ప్రొసీడింగ్స్ పొందవచ్చని పేర్కొన్నారు.
ఈ మేళాకు పట్టణ ప్రణాళిక అధికార యంత్రాంగం, ప్లానింగ్ కార్యదర్శులు, ఎల్‌టిపిలు హాజరవుతున్నారు. గురు, శుక్రవారల్లో రెండు రోజుల పాటు స్థానిక ఎస్బిఐ ఎంప్లాయిస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో గురు, శుక్రవారాల్లో ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు.
దరఖాస్తుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కమిషనర్ చల్లా ఓబులేసు సూచించారు.




