Kurnool: మత్తు పదార్థాలకు దూరంగా ఉంటాం కర్నూలు విద్యార్థుల ప్రతిజ్ఞ!

Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో నిషాముక్త భారత్ అభియాన్. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని 550 మంది విద్యార్థుల ప్రతిజ్ఞ.

V RAMAMOHAN, KURNOOL
Published on: 3 Aug 2026 2:20 PM IST
Kurnool
X

Kurnool: మత్తు పదార్థాలకు దూరంగా ఉంటాం కర్నూలు విద్యార్థుల ప్రతిజ్ఞ!

కర్నూలు: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో నిషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 550 మంది విద్యార్థులు పాల్గొని మత్తు పదార్థాలను ఉపయోగించబోమని, ఇతరులను కూడా మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా చైతన్యం కల్పిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం విద్యార్థులకు నిషాముక్త భారత్ ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు (Registration) కూడా నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలు, వాటి నివారణకు యువత బాధ్యత గురించి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని, ప్రతి విద్యార్థి తన కుటుంబం, స్నేహితుల్లో కూడా నిషాముక్త భారత్ సందేశాన్ని విస్తరించాలని పిలుపునిచ్చారు.

అధ్యాపకులు మాట్లాడుతూ, మత్తు పదార్థాలు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తాయని, క్రమశిక్షణ, మంచి అలవాట్లు మరియు విద్య ద్వారానే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, తనతో పాటు మరో పది మందికి కూడా అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విజయశేఖర్, కృష్ణమోహన్, రామకృష్ణ, జబీన్ అక్తర్, సుజాత, సోమేష్, శారధి పటేల్, చిన్న మల్లేశ్, ఉల్గోజి రావు, జసింత, సాయి శ్రావణి, శ్రీధర్ మూర్తి, బాలశంకర్ పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story