Kurnool: ఎన్డీఏ కూటమి సమన్వయ కమిటీ కీలక సమావేశం
Kurnool: కర్నూలులో ఎన్డీఏ కూటమి సమన్వయ కమిటీ సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం విజయమే లక్ష్యంగా పనిచేయాలని నేతల పిలుపు.
Kurnool: ఎన్డీఏ కూటమి సమన్వయ కమిటీ కీలక సమావేశం
కర్నూలు: కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో కర్నూలు జిల్లా తెలుగుదేశం, జనసేన, బీజేపీ (ఎన్.డి.ఏ కూటమి) నాయకుల సమన్వయ కమిటీ సమావేశం జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ గారి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశానికి టీడీపీ జోన్–5 కోఆర్డినేటర్ మరియు స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌చార్జి శ్రీ పెళ్ళకూరు శ్రీనివాస రెడ్డి జనసేన కోఆర్డినేటర్ శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి సమన్వయ కమిటీ సభ్యులు శ్రీ చింతా సురేష్ శ్రీమతి రేఖ గౌడ్, శ్రీ అర్షద్, బీజేపీ జిల్లా అధ్యక్షులు *శ్రీ బి. రామకృష్ణ పరమహంస, రాష్ట్ర బిల్డింగ్ కమిటీ సభ్యులు శ్రీ విట్టా రమేష్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సమావేశమునకు హాజరైన నాయకులు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూటమి పార్టీల మధ్య సమన్వయం, ఎన్నికల వ్యూహం, క్షేత్రస్థాయి కార్యాచరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నిర్ణయించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్.డి.ఏ కూటమి నూటికి నూరు శాతం విజయం సాధించేలా సమష్టి కార్యాచరణ రూపొందించుకొని, క్షేత్రస్థాయిలో సమన్వయంతో ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు. కూటమి ఐక్యతను మరింత బలోపేతం చేసి, ప్రజల మద్దతుతో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు పేర్కొన్నారు.




