Kurnool: రూ.2.83 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
Kurnool: ఓర్వకల్లులో రూ.2.83 కోట్ల వ్యయంతో నిర్మించిన కేజీబీవీ జూనియర్ కళాశాల భవనం, జీపీహెచ్ఎస్ ల్యాబ్‌ను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ప్రారంభించారు.
Kurnool: రూ.2.83 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
కర్నూలు: ఓర్వకల్లు మండల కేంద్రంలో రూ.2.83 కోట్ల వ్యయంతో పూర్తయిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన పాణ్యo నియోజకవర్గం ఎమ్మెల్యే, టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గౌరు చరిత రెడ్డి
ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ల్యాబ్‌ను రూ.41.60 లక్షలతో, మండల విద్యాశాఖ కార్యాలయ భవనాన్ని రూ.53 లక్షలతో, కేజీబీవీ జూనియర్ కళాశాల భవనాన్ని రూ.1.60 కోట్లతో నిర్మించారు.
అలాగే ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల కింద హైవే నుంచి మోడల్ స్కూల్ వరకు రూ.18 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు,ఈ అభివృద్ధి పనులు విద్యా రంగ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల మెరుగుదలకు దోహదపడనున్నాయి అని ఎమ్మెల్యే తెలిపారు.
Next Story




