Kurnool: టమోటా ధరకు తీవ్ర గ్రహణం కిలో కేవలం 50 పైసలే!
Kurnool: కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమోటా ధరలు కుప్పకూలాయి. కిలో రూ.0.50 పైసలకే పడిపోవడంతో రవాణా ఖర్చులు కూడా రాక రైతులు తీవ్ర ఆవేదన.
Kurnool: టమోటా ధరకు తీవ్ర గ్రహణం కిలో కేవలం 50 పైసలే!
Kurnool: కర్నూలు జిల్లా పత్తికొండ టమోటా మార్కెట్‌లో టమోటా ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. కిలోకు కేవలం 50 పైసలు మాత్రమే పలుకుతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం ఘనంగా ప్రారంభమైన పత్తికొండ టమోటా మార్కెట్‌లోనే తొలి వారంలో ధరలు నేలచూపులు చూశాయి.
వర్షాభావం, ఎల్‌నినో ప్రభావంతో అరకొర పంట మాత్రమే పండించిన రైతులకు ఇప్పుడు గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదు. కిలోకు 50 పైసలు మాత్రమే రావడంతో ఆటో అద్దె, రవాణా ఖర్చులకే డబ్బులు సరిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.
Next Story




