Kurnool: కర్నూలులో లారీ చోరీ కేసు ఛేదన: ఇద్దరు నిందితుల అరెస్ట్!

Kurnool: కర్నూలులో రూ.10 లక్షల విలువైన లారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పందిపాడు వద్ద ఇద్దరు నిందితులను అరెస్టు చేసి లారీని స్వాధీనం చేసుకున్నారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 10 Nov 2026 10:28 PM IST
Kurnool
X

Kurnool: కర్నూలులో లారీ చోరీ కేసు ఛేదన: ఇద్దరు నిందితుల అరెస్ట్!

కర్నూల్: కర్నూల్ వన్ టౌన్ ఏరియా లోని దండిగేరిలో నివాసం ఉంటున్న ప్రేమనాథ్ అను వ్యక్తి తనకు చెందిన లారీ నెంబర్ AP04 U 5526 ను కర్నూలు పట్టణం రిలయన్స్ మార్ట్ వద్ద గల లారీ అసోసియేషన్ యార్డ్ నందు పార్కు చేసి ఉండగా, గుర్తుతెలియని వ్యక్తులు తన లారీని మొన్నటి దినం దొంగతనం చేశారు.

అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు పరుచుకొని అందుబాటులోని సిసి ఫుటేజ్ లను పరిశీలించి ఆ ఫుటేజ్ లలో ఉన్నటువంటి ఇద్దరు అనుమానితుల గురించి విచారించగా వారిద్దరూ కర్నూలు పట్టణం ముజాఫర్ నగర్ కు చెందిన సతీష్ మరియు గోపాల్ గా గుర్తించడం జరిగింది.

ఈ రోజున వారి కదలికల గురించి వచ్చిన ఖత్చితమైన సమాచారం మేరకు పందిపాడు దగ్గరలోని గోడ ఆంజనేయస్వామి గుడి వద్ద సదరు సతీష్, గోపాల్ లను ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేసి సదరు ఏరియాలో వాళ్లు పార్కు చేసి ఉంచిన సుమారు 10 లక్షల విలువ చేసే లారీని స్వాధీనం చేసుకోవడం అయినది.

విచారణలో సదరు సతీష్ అనే వ్యక్తి గతంలో లారీ డ్రైవర్ గా పని చేస్తూ అనతి కాలంలోనే రెండు లారీలకు ఓనర్ గా మారి, సరైనటువంటి బిజినెస్ జరక్క ఆ లారీలను ఫైనాన్స్ వాళ్లు సీజ్ చెయ్యగా, అతను యాక్టింగ్ లారీ డ్రైవర్ గా పని చేస్తూ తనకున్న అప్పులు తీర్చుకోడానికి వేరే దారి లేక సదరు లారీ ని దొంగతనం చేసి అమ్ముకోడానికి దాచి ఉంచామని విచారణలో తేలింది.

సతీష్ కి లారీని దొంగతనం చేయడానికి సహకరించిన గోపాల్ మీద కర్నూలు 4th టౌన్ పోలీస్ స్టేషన్, , ఆత్మకూరు తదితర పోలీస్ స్టేషన్లో సుమారు 8 కి పైగా దొంగతనం కేసులు నమోదై ఉన్నవి. ఇద్దది మీద suspect షీట్స్ ఓపెన్ చేసి నిఘా ఉంచడం జరుగుతుంది.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL