Kurnool: ధ్యానంతో ఒత్తిడి దూరం.. కర్నూలు పోలీసులకు ప్రత్యేక మెడిటేషన్!

Kurnool: సీఎం చంద్రబాబు నాయుడు సూచనలతో, కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షణలో జిల్లా పోలీసులకు 3 రోజుల పాటు ప్రత్యేక హార్ట్‌ఫుల్‌నెస్ మెడిటేషన్ తరగతులు ప్రారంభమయ్యాయి.

V RAMAMOHAN, KURNOOL
Updated on: 25 May 2026 10:45 AM IST
Kurnool
X

Kurnool: ధ్యానంతో ఒత్తిడి దూరం.. కర్నూలు పోలీసులకు ప్రత్యేక మెడిటేషన్!

కర్నూలు: రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ఆదేశాల మేరకు, కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ పర్యవేక్షణలో పోలీసు అధికారులు, సిబ్బందికి మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం మూడు రోజుల పాటు ప్రత్యేక హార్ట్‌ఫుల్‌నెస్ వారి ఆధ్వర్యంలో మెడిటేషన్ తరగతులు నిర్వహిస్తున్నారు.

హార్ట్‌ఫుల్‌నెస్ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో మే 25, 26, 27 తేదీల్లో పోలీసులకు ధ్యాన తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కర్నూలు రేంజ్ డీఐజీ కార్యాలయం, జిల్లా పోలీసు కార్యాలయం పరేడ్ మైదానంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని యోగా ఆసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధన చేశారు. హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ప్రతినిధులు మరియు ట్రైనర్లు సిబ్బందికి శ్వాసక్రియలు, ఏకాగ్రత పెంపొందించే సాధనలు, మానసిక ఒత్తిడిని తగ్గించే ధ్యాన విధానాలపై ప్రత్యేక శిక్షణ అందించారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ..

ధ్యానం ద్వారా ఒత్తిడి తగ్గి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమని పోలీసు అధికారులు తెలిపారు. పోలీసు విధుల్లో ఎదురయ్యే ఒత్తిడి, మానసిక ఆందోళనలను తగ్గించేందుకు యోగా, ధ్యానం ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. క్రమం తప్పకుండా ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక దృఢత్వం పెంపొందడంతో పాటు విధి నిర్వహణలో మరింత సమర్థత సాధించవచ్చని పేర్కొన్నారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడంలో యోగా, ప్రాణాయామం కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వీటిని అలవాటు చేసుకోవాలని సూచించారు.

డీఐజీ కార్యాలయo, జిల్లా పోలీస్ కార్యాలయం తో పాటు సిఐడి, ఏపీఎస్పీ రెండో బిటాలియన్, వెల్దుర్తి, క్రిష్ణగిరి, ఆదోని, పత్తి కొండ,ఎమ్మిగనూరులలో పోలీసులకు హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ ఆధ్వర్యంలో మెడిటేషన్ తరగతులు ఈ మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ కృష్ణమోహన్, మహిళా పీఎస్ డీఎస్పీ ఉపేంద్రబాబు, సీఐలు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్సైలు, డిఐజి, జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది, హార్టఫుల్ నెస్ సంస్థ జిల్లా సమాన్వయకర్త (డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ )శ్రీ వెంకట రెడ్డి, ట్రైనర్ లు శ్రీ రవీంద్రనాథ్, వంశీ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story