Gudur: గూడూరు మండలం చనుగొండ్లలో పోలీసుల అవగాహన సదస్సు
Gudur: గూడూరు మండలం చనుగొండ్లలో పోలీసులు సైబర్ నేరాలు, IVRS కాల్స్ మరియు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
Gudur: గూడూరు మండలం చనుగొండ్లలో పోలీసుల అవగాహన సదస్సు
గూడూరు: గూడూరు మండలం చనుగొండ్ల గ్రామంలో ప్రజలకు పోలీసులు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా IVRS కాల్స్, సైబర్ నేరాలు, మహిళలపై జరిగే నేరాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా శాంతియుత వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొనాలని పోలీసులు సూచించారు. MPTC, సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
అత్యవసర పరిస్థితుల్లో 112, సైబర్ నేరాల కోసం 1930, బాలల రక్షణ కోసం 1098 హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, నేరాల నివారణకు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోడుమూరు సీఐ తబ్రేజ్, గూడూరు ఎస్‌ఐ రాజాకుళాయప్ప పాల్గొన్నారు.




