Kurnool: విద్యా రంగంలో విశేష కృషికి గుర్తింపుగా పురస్కారం
Kurnool: కర్నూలు బి-క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ ‘ఆదర్శ విద్యారత్న సమ్మాన్ – 2025’ పురస్కారాన్ని అందుకున్నారు.
Kurnool: విద్యా రంగంలో విశేష కృషికి గుర్తింపుగా పురస్కారం
Kurnool: గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌కు “ఆదర్శ విద్యారత్న సమ్మాన్ – 2025” పురస్కారం. కర్నూలు బి-క్యాంప్‌లోని ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. నాగస్వామి నాయక్ గారు ప్రతిష్టాత్మకమైన “ఆదర్శ విద్యారత్న సమ్మాన్ – 2025” పురస్కారాన్ని అందుకున్నారు. విద్యా రంగంలో ఆయన అందించిన విశిష్ట సేవలు, విద్యార్థుల అభివృద్ధికి చేసిన నిరంతర కృషి, సమాజానికి అందించిన ప్రేరణాత్మక సేవలను గుర్తిస్తూ Blue Star Events సంస్థ ఈ అవార్డును ప్రదానం చేసింది.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరీ చరిత రెడ్డి గారి చేతుల మీదుగా శనివారం ఈ పురస్కారం డా. నాగస్వామి నాయక్ గారికి అందజేయబడింది. అవార్డుతో పాటు సర్టిఫికేట్ ఆఫ్ అచీవ్మెంట్‌ను కూడా అందించారు.
డా. నాగస్వామి నాయక్ గారు విద్యా రంగంలో అనేక సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తూ, విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించడంలో, వృత్తి విద్యపై అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి మార్గదర్శకత్వంలో కళాశాల అనేక విజయాలను సాధించింది. విద్యార్థుల శ్రేయస్సు కోసం తీసుకుంటున్న పలు కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ఈ పురస్కారం అందుకున్న సందర్భంగా కళాశాల బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు ప్రిన్సిపాల్ గారిని ఘనంగా అభినందించారు. ఆయన కృషి వల్ల కళాశాల మరింత అభివృద్ధి చెందుతుందని, విద్యార్థులకు మంచి భవిష్యత్తు కల్పించడంలో ఆయన పాత్ర విశేషమని తెలిపారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ గారు మాట్లాడుతు కళాశాల అభివృద్ధి కోసం ఇంకా మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టి, విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేరుస్తానని తెలియసజేశారు.




