Kurnool: బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి కర్నూలులో ఘన నివాళి
Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సభ. చిత్రపటానికి నివాళులర్పించిన ప్రిన్సిపాల్ డాక్టర్ నాగస్వామి నాయక్.
Kurnool: బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి కర్నూలులో ఘన నివాళి
కర్నూలు: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలలో భారత మాజీ ఉప ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, సామాజిక న్యాయ సాధకుడు బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ (గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్) ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
బాబూ జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశ స్వాతంత్ర్య పోరాటంలో చేసిన సేవలు, సామాజిక సమానత్వం కోసం చేసిన కృషి, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తీసుకున్న చర్యలు, భారతదేశ అభివృద్ధిలో ఆయన పోషించిన విశిష్ట పాత్రను ప్రిన్సిపాల్ విద్యార్థులకు వివరించారు.
ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ మాట్లాడుతూ, బాబూ జగ్జీవన్ రామ్ జీవితం యువతకు ఆదర్శప్రాయమని, కృషి, నిజాయితీ, సేవాభావంతో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అన్నారు. విద్యార్థులు రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ సమాజ అభివృద్ధికి తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.
అధ్యాపకులు మల్లికార్జున, విజయ శేఖర్, రామకృష్ణ, ఉల్గోజి రావు, శారధి పటేల్, చిన్న మల్లేష్, కృష్ణమోహన్, శ్రీధర్ మూర్తి, బాల శంకర్ పాల్గొన్నారు. కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాబూ జగ్జీవన్ రామ్ ఆశయాలను స్మరించుకుంటూ సామాజిక సమానత్వం, విద్యాభివృద్ధి, దేశసేవ పట్ల అంకితభావంతో పనిచేయాలని ప్రతిజ్ఞ చేశారు.




