Kurnool: వినాయక ఘాట్‌కు మునుపటి శోభ తీసుకొద్దాం
Kurnool: కర్నూలు వినాయక ఘాట్‌ను కమిషనర్ చల్లా ఓబులేసు పరిశీలించారు. ఘాట్‌ను పరిశుభ్రంగా ఉంచాలని, కేసీ కెనాల్‌లో చెత్త వేయొద్దని కోరారు.
Kurnool: వినాయక ఘాట్‌కు మునుపటి శోభ తీసుకొద్దాం
కర్నూలు: నగరంలోని వినాయక ఘాట్‌ను పరిశుభ్రంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్ది మునుపటి శోభను తీసుకురావాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు సిబ్బందిని ఆదేశించారు. గురువారం వినాయక ఘాట్‌ను కమిషనర్ పరిశీలించారు. ఘాట్ పరిసరాల్లో ఎక్కడా అపరిశుభ్రత కనిపించకుండా శుభ్రపరిచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఘాట్ పరిసరాల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, ఇతర అవశేషాలను పూర్తిగా తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
వినాయక ఘాట్‌కు వచ్చే ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పేలా, ఘాట్ పరిసరాల్లో ప్రతిరోజూ పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, పరిశుభ్రతను కాపాడేలా ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు.
వినాయక ఘాట్ ఒక ఆధ్యాత్మిక, పవిత్ర ప్రదేశమని, అందువల్ల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. కెసి కెనాల్‌లో చెత్తాచెదారం వేయరాదని, నీటి ప్రవాహం లేని సమయంలో చెత్తాచెదారం వేయడం కారణంగా తలెత్తే సమస్యలను గతంలో ప్రజలందరూ గమనించారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని నగర ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ కోరారు.




