Kurnool: ఒలంపిక్ డే వేడుకలు.. రిడ్జ్ స్కూల్‌లో విలువిద్య పోటీలు!
Kurnool: వరల్డ్ ఒలంపిక్ డే సందర్భంగా కర్నూలు లక్ష్మీపురంలోని రిడ్జ్ స్కూల్‌లో ఉమ్మడి జిల్లా స్థాయి ఆర్చరీ (విలువిద్య) పోటీలను ఘనంగా నిర్వహించారు.
Kurnool: ఒలంపిక్ డే వేడుకలు.. రిడ్జ్ స్కూల్‌లో విలువిద్య పోటీలు!
కర్నూలు: ఏకాగ్రత విలువిద్య సాధన చేయాలి, స్థానిక లక్ష్మీపురంలోని రిడ్జ్ స్కూల్ క్రీడా ప్రాంగణంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి విలువిద్య నిర్వహించినారు.
జి. గోపినాథ్ CEO విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విలువిద్య యొక్క గొప్పతనం, ఏకాగ్రత, క్రమశిక్షణ, సహనం మరియు శారీరక దృఢత్వం గురించి వివరించారు. క్రీడల ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు.
కర్నూలు జిల్లా ఆర్చరీ కార్యదర్శి
K నాగరత్నమయ్య విద్యార్థులతో మాట్లాడుతూ జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలలో ఆర్చరీ క్రీడలో ఉన్న అవకాశాలను వివరించారు. విద్యార్థులు ఈ క్రీడలో చురుకుగా పాల్గొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రోత్సహించారు.
జి. సౌమ్య గోపినాథ్ (Co-CEO) మాట్లాడుతూ ఆర్చరీ క్రీడ ప్రాముఖ్యతను వివరించి, విద్యార్థులు అందుబాటులో ఉన్న శిక్షణ అవకాశాలను సద్వినియోగం చేసుకొని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డీన్ పి.కె. రాజేంద్రన్, ప్రిన్సిపాల్ ఎ. రాజ్‌కమల్, శ్రీనివాసులు, నాగేంద్ర, చరణ్, రహ్మతుల్లా, గంగన్న, ఇమామ్ హుస్సేన్, మద్దిలేటి, భరత్ మరియు,సురేంద్ర పాల్గొన్నారు.
విద్యార్థులకు విలువిద్యపై అవగాహన కల్పించడంతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది.




