Kurnool: మంత్రాలయం స్వామి దర్శనం ముగించుకుని వస్తుండగా ఘోరం.. నవవరుడు మృతి!

Kurnool: కర్నూలు జిల్లా నందవరం మండలం ముగతి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.

S Khaleel, Yemmiganur
Updated on: 15 May 2026 7:22 PM IST
Kurnool
X

Kurnool: మంత్రాలయం స్వామి దర్శనం ముగించుకుని వస్తుండగా ఘోరం.. నవవరుడు మృతి!

Kurnool: కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. నందవరం మండలం ముగతి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక నవవరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.​మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి వారిని దర్శించుకుని, తిరిగి ఆటోలో వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ముగతి గ్రామ సమీపంలోకి రాగానే ఆటోకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయిన క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది.​ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నవవరుడు రంగుడు (21)అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య శ్రావణి కి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.​మృతుడు కప్పట్రాళ్ల గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. పెళ్లయిన కొద్దిరోజులకే భర్త ప్రాణాలు కోల్పోవడంతో భార్య శ్రావణి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

S Khaleel, Yemmiganur

S Khaleel, Yemmiganur

Next Story