Kurnool: మహిళల హక్కులు, రక్షణపై అవగాహన సదస్సు
Kurnool: కర్నూలులో మహిళల హక్కులు, రక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు. వరకట్న నిషేధ ప్రతిజ్ఞ చేయించి, కొండారెడ్డి బురుజు వరకు ర్యాలీ చేపట్టారు.
Kurnool: మహిళల హక్కులు, రక్షణపై అవగాహన సదస్సు
కర్నూలు: గౌరవ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు కర్నూలు,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి జిల్లా న్యాయ సేవా సంస్థ నందు మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు లా కాలేజీ మరియు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మహిళల హక్కులు రక్షణ మరియు లింగ సమానత్యం మరియు మహిళలకు సంబంధించిన ప్రాథమిక హక్కులు పై వన్ స్టాఫ్ సెంటర్ సిబ్బంది కి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి, మహిళా పోలీసులకు, పోలీసులకు, లా కాలేజీ స్టూడెంట్ లకు,ఎన్జీవోలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా వెంకట శేషాద్రి మాట్లాడుతూ మహిళలకు చట్టపరంగా కీలకమైన రక్షణలు, హక్కులు ఉన్నాయని తెలిపారు. గృహహింస నిరోధక చట్టం, 2005 ప్రకారం కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామి నుండి శారీరక మానసిక ఆర్థిక వేధింపుల నుండి మహిళలకు రక్షణ కల్పిస్తుందని తెలిపారు. వరకట్న నిషేధ చట్టం 1961 ద్వారా కట్నం తీసుకోవడం లేదా ఇవ్వడం చట్టపకారం నేరమని తెలిపారు.
వరకట్నం వేధింపులకు కఠిన శిక్షలు ఉన్నాయని తెలిపారు. శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ మాట్లాడుతూ పనిచేయు చోట మహిళలకు లైంగిక వేధింపుల నిరోధక చట్టం, 2013 ప్రకారం కార్యాలయంలలో మహిళలకు రక్షణ కల్పిస్తూ లైంగిక వేధింపుల నివారణకు మరియు పరిష్కారానికి ఈ చట్టం తోడ్పడుతుందని తెలిపారు. శాశ్వత లోక్ అదాలత్ అనేది ప్రజా వినియోగ సేవలు కోసం ఏర్పాటు చేయబడిందని తెలిపారు. దీనిలో 10 సేవలకు సంబంధించి వినియోగదారులకు మరియు ఆయా సంస్థలకు గల వివాదాలను కోటి రూపాయల పరిధి వరకు ఎటువంటి కోర్ట్ ఫీజు, ఖర్చు లేకుండా సత్వరంగా పరిష్కరించు కోవచ్చునని తెలిపారు.
మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయ మాట్లాడుతూ ఎక్కడైనా గృహహింస జరిగినప్పుడు మహిళలు వారి మండలంలో గల సిడిపిఓ లను సంప్రదిస్తే వారు వారికి రక్షణ మరియు చట్టప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. మహిళా హక్కుల కోసం తమ డిపార్ట్మెంట్ లో గల లీగల్ కౌన్సిల్స్ మరియు వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది అన్ని విధాలా కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రసున్న లా కాలేజీ లెక్చరర్ హేమలత మాట్లాడుతూ విద్య మరియు ఉద్యోగములలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా సమాన అవకాశాలు కలవని తెలిపారు.
ప్రాథమిక హక్కు ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే మరియు చట్టం అందరికీ సమాన రక్షణ కల్పిస్తుంది అని తెలిపారు. అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సులోచన మాట్లాడుతూ ఆర్టికల్ 15(3) ప్రకారం మహిళలు మరియు పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేక నిబంధన కలవని తెలిపారు. అనంత రం వరకట్న నిషేధ ప్రతిజ్ఞ అందరితో చేయించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళల రక్షణ కొరకై ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ 181 పై ఏర్పాటు చేసిన వాల్ పోస్టర్ లను జడ్జి గారి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
అనంతరం జిల్లా న్యాయ సేవ సదన్ నుండి కొండారెడ్డి బురుజు వరకు వరకట్న నిషేధంపై ర్యాలీలను నిర్వహించారు. ఈ సదస్సులో శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్,మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ విజయ, ప్రసున్నా లా కాలేజ్ లెక్చరర్ హేమలత, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సులోచన, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శారద, డొమెస్టిక్ వయోలెన్స్ లీగల్ కౌన్సిల్ విజయలక్ష్మి, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ నాగరాజు, వన్ స్టాప్ సెంటర్ సిబ్బంది మహిళా పోలీసులు, లీగల్ టీం సభ్యులు, పోలీసులు, ఎన్జీవోలు, లా కాలేజీ స్టూడెంట్స్ పాల్గొన్నారు.




