Kurnool: నీట్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

Kurnool: కర్నూలు పట్టణంలో ఆదివారం జరగనున్న నీట్ (UG) పరీక్షలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ IPS తెలిపారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 2 May 2026 9:54 PM IST
Kurnool
X

Kurnool: నీట్ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

Kurnool: రేపు (03.05.2026 తేదీన ) మధ్యాహ్నం 2:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు నిర్వహించబడనున్న NEET (UG) పరీక్షల సందర్భంగా కర్నూలు పట్టణంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ IPS గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

కర్నూలు పట్టణంలో మొత్తం 16 పరీక్షా కేంద్రాలలో 5,040 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షలు ప్రశాంతంగా, అవాంతరాలు లేకుండా జరిగేలా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పరీక్షా కేంద్రాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులపై కఠిన నిఘా ఉంచడం జరుగుతుంది. పరీక్ష సమయాల్లో విద్యార్థులు సమయానికి ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో రావాలని సూచించారు.

అలాగే, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉండడంతో, అనవసరంగా గుమికూడకుండా ప్రజలు సహకరించాలని కోరారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story