Kurnool: ఎస్పీ క్యాంపు ఆఫీస్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ!
Kurnool: కర్నూలు ఎస్పీ క్యాంపు ఆఫీస్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎస్పీ విక్రాంత్ పాటిల్ IPS. సిబ్బందికి శుభాకాంక్షలు.
Kurnool: ఎస్పీ క్యాంపు ఆఫీస్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ!
Kurnool: జిల్లా ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో ఘనంగా 80 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేసిన .... కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. కర్నూలు ఎస్పీ గారి క్యాంపు కార్యాలయంలో కర్నూలు ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ జాతీయ పతాక ఆవిష్కరణ చేసి, జెండా వందనం గావించి తదనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
పోలీసు సిబ్బందికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మిఠాయిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐలు మధుసూదన రావు, కేశవరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు ఖాజావళి, ఉస్మాన్ , ఎస్పీ గారి సిసి సాకేత్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Next Story




