Kurnool: కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఆసుపత్రి తనిఖీ

Kurnool: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో వైద్య సేవలకు అంతరాయం కలగకుండా సూపరింటెండెంట్ ఓటీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 8 Oct 2026 5:52 PM IST
Kurnool
X

Kurnool: కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో ఆసుపత్రి తనిఖీ

కర్నూలు: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కే. వెంకటేశ్వర్లు ఆసుపత్రిలోని వివిధ ఆపరేషన్ థియేటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మెలో ఉన్న నేపథ్యంలో ఆసుపత్రిలో వైద్య సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ సిబ్బంది విధుల్లో అందుబాటులో ఉన్నారా లేదా అనే విషయాన్ని సూపరింటెండెంట్ పరిశీలించారు.

ముఖ్యంగా ఆపరేషన్ థియేటర్లలో వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది విధుల్లో ఉన్నారా, రోగులకు అవసరమైన సేవలు అందుతున్నాయా అనే అంశాలను తనిఖీ చేశారు.

సూపరింటెండెంట్ డా. కే. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె కారణంగా ఆసుపత్రిలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోగులకు వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని చెప్పారు.

అత్యవసర వైద్య సేవలు, ఆపరేషన్లు నిరంతరాయంగా కొనసాగేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటు ఆసుపత్రి అడ్మినిస్ట్రేషన్ అధికారులు పాల్గొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL