Kurnool: కర్నూలులో టీడీపీ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం
Kurnool: ర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ (TDP) అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
Kurnool: కర్నూలులో టీడీపీ ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం
Kurnool: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన వాతావరణం అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.
పెరుగుతున్న కాలుష్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో చెట్ల పెంపకం అత్యంత అవసరమని పేర్కొన్నారు. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని, ప్రకృతిని కాపాడేందుకు ముందుకు రావాలని శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ గారు కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎక్స్ ఎంపీపీ మురళి , బిస్తా ఓంకార్ , కల్లుబావి మల్లికార్జున, అలసంద గుత్తి రాజాశేఖర్, బాబురావు, రాఘవరెడ్డి, భరత్, పగల హనుమంతు, వెంకట్ నారాయణ, అంజి, చంద్ర, దేవేంద్ర, విజయ్ మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.




