Kurnool: ఏపీ మెగా యూత్ ఫోర్స్ కో-కన్వీనర్‌గా తోళ్ళ మంజునాథ్
Kurnool: మెగా యూత్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-కన్వీనర్‌గా కర్నూలుకు చెందిన తోళ్ళ మంజునాథ్ నియామకం. ఉత్తర్వులు జారీ చేసిన కొణిదెల సుస్మిత.
Kurnool: ఏపీ మెగా యూత్ ఫోర్స్ కో-కన్వీనర్‌గా తోళ్ళ మంజునాథ్
కర్నూల్: కర్నూలుకు చెందిన ఏపీ స్టేట్ వాల్మీకి బోయ కార్పొరేషన్ డైరెక్టర్ తోళ్ళ మంజునాథ్‌ను మెగా యూత్ ఫోర్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-కన్వీనర్‌గా నియమించారు.
మెగాస్టార్ చిరంజీవి సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని సామాజిక సేవలో చూపుతున్న అంకితభావం, ప్రజా సేవ పట్ల నిబద్ధత, అలాగే మెగా అభిమానులను ఏకతాటిపై నడిపించే నాయకత్వ లక్షణాలను గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించినట్లు సంస్థ గౌరవ అధ్యక్షురాలు సుస్మిత కొణిదెల తెలిపారు.
హైదరాబాద్‌లో నిర్వహించిన మెగా అభిమానుల సమావేశంలో ఈ నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు..ఈ సందర్భంగా తోళ్ళ మంజునాథ్ మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి సంస్థ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మెగాస్టార్ చిరంజీవి సేవా సిద్ధాంతాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.




