Kurnool: ఆర్‌సీబీ విజయోత్సవాల్లో వీరంగం!

Kurnool: కర్నూలు రాజ్ విహార్ సెంటర్‌లో బస్సుల అద్దాలు ధ్వంసం చేసిన 18 మంది అరెస్ట్.. టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి నడిరోడ్డుపై కోర్టుకు తరలింపు.

V RAMAMOHAN, KURNOOL
Published on: 1 Jun 2026 9:43 PM IST
Kurnool
X

Kurnool: ఆర్‌సీబీ విజయోత్సవాల్లో వీరంగం!

కర్నూలు: కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి కోర్టు వరకు నడిరోడ్డుపై తీసుకెళ్లిన పోలీసులు ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు విజయం సాధించిన నేపథ్యంలో నిర్వహించిన విజయోత్సవాల సందర్భంగా కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులతో పాటు బస్సుల అద్దాలు ధ్వంసం చేసి నష్టం కలిగించిన ఘటనపై కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు టూ టౌన్ సీఐ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలు, సోషల్ మీడియా వీడియోలు మరియు ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించి ఘటనలో పాల్గొన్న 18 మంది వ్యక్తులను గుర్తించి అరెస్టు చేశారు.

కొనసాగుతున్న దర్యాప్తు కోర్టుకు తరలించారు. ప్రజా ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసానికి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టం చేశారు. విజయోత్సవాలు, పండుగలు, ఇతర వేడుకలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story