Kurnool: ఇంటర్మీడియట్‌లో 945 మార్కులు – విద్యార్థికి షైనింగ్ స్టార్ అవార్డు!

Kurnool: కర్నూలు ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల విద్యార్థి సాయి పురందేశ్వర్‌కు 'షైనింగ్ స్టార్' అవార్డు. ప్రధానం చేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి.

V RAMAMOHAN, KURNOOL
Published on: 23 July 2026 10:39 AM IST
Kurnool
X

Kurnool: ఇంటర్మీడియట్‌లో 945 మార్కులు – విద్యార్థికి షైనింగ్ స్టార్ అవార్డు!

Kurnool: ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాలకు చెందిన ఈఈటీ (EET) విద్యార్థి వరద సాయి పురందేశ్వర్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో 945/1000 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబరిచారు. ఈ సందర్భంగా ఆయనకు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో షైనింగ్ స్టార్ అవార్డు ను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి గారి చేతుల మీదుగా ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) సుధాకర్ SSA లోక రాజ్ పాల్గొని విద్యార్థి ప్రతిభను అభినందించారు. కష్టపడి చదివితే ఉన్నత విజయాలు సాధించవచ్చని, వరద సాయి పురందేశ్వర్ ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ వృత్తి విద్యా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. నాగస్వామి నాయక్ విద్యార్థిని అభినందిస్తూ, కళాశాల విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఈఈటీ అధ్యాపకులు కృష్ణమోహన్, శ్రావణి పాల్గొని విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థి సాధించిన ఈ విజయం కళాశాలకు గర్వకారణమని వారు పేర్కొన్నారు.

V RAMAMOHAN, KURNOOL

V RAMAMOHAN, KURNOOL

Next Story