Kurnool: అధికారుల నిర్లక్ష్యం ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్‌లో రైతుల ఆగ్రహం
Kurnool: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్‌లో డ్రైనేజీ సమస్య వల్ల ఓ రైతుకు భారీ నష్టం వాటిల్లింది.
Kurnool: అధికారుల నిర్లక్ష్యం ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్‌లో రైతుల ఆగ్రహం
కర్నూలు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మార్కెట్ యార్డ్‌లో డ్రైనేజీ సమస్య వల్ల రైతుకు నష్టం వాటిల్లింది. డ్రైనేజీ బ్లాక్ కావడంతో వర్షపు నీటి ప్రవాహంలో ఓ రైతుకు చెందిన సుమారు 5 క్వింటాళ్ల వేరుశెనగ కొట్టుకుపోయింది.
దేవనకొండ మండలం ఐరన్ బండ బీ సెంటర్‌కు చెందిన రైతు 68 బస్తాల వేరుశెనగను మార్కెట్‌కు తీసుకురాగా సాయంత్రం హఠాత్తుగా వర్షం కురిసింది.తన వేరుశెనగ రాశి పై టార్పాలిన్ కవర్ కప్పినా నీరు వెనక్కి రావడంతో ఈ ఘటన చోటుచేసుకుందని రైతు కర్ణ తెలిపాడు.
గత కొన్నేళ్లుగా సమస్య కొనసాగుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో రైతులు తరచూ నష్టపోతున్నారు.భారీ షెడ్ నిర్మాణం మధ్యలో ఆగిపోవడం,డ్రైనేజి సక్రమంగా లేకపోవడం వల్ల ఆరుబయట రాశులు పోసి నష్టపోతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తనకు న్యాయం చేయాలని రైతు కర్ణ అధికారులను వేడుకుంటున్నాడు.




