Kurnool: లోకేష్‌తో డిబేట్‌కు మా సామాన్య కార్యకర్త చాలు..మోహన్ సవాల్!
Kurnool: కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై, టీడీపీ మహానాడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Kurnool: లోకేష్‌తో డిబేట్‌కు మా సామాన్య కార్యకర్త చాలు..మోహన్ సవాల్!
Kurnool: వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి కామెంట్స్.. నిన్న మహానాడులో చంద్రబాబును, లోకేష్ ను పొగడడం జగన్ ను విమర్శించడం తప్ప రాష్ట్రానికి ఎం చేశారో చెప్పలేదు. మాదీ గొడ్డలి పార్టీ కాదు సంక్షేమ అమలు పార్టీ. ప్రజలే నేరుగా వారి ఖాతాలో డబ్బులు వేసిన పార్టీ మది. మిగతా రాష్ట్రాల్లో సెక్టారియేట్ ఒకే దగ్గర ఉంటే జగన్ ప్రభుత్వం హయాంలో ప్రతి ఊరిలో సెక్టారియేట్ పెట్టి పాలన అందించారు. మద్ది గొడ్డలి పార్టీ అంటున్నారు మీది వెన్నుపోటు పార్టీ కదా. మహిళలు,ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను పెన్షన్ ఇస్తామని వెన్నుపోటు పొడిచిన పార్టీ మీది. మెగా డిఎస్సీ అని చెప్పి మెరిట్ లిస్ట్ కూడా ప్రకటించకుండా యువతను వెన్నుపోటు పొడిచారు.
ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తప్పించుకోవడానికి జగన్ ను విలన్ గా చేసి చూపిస్తున్నారు. వంగవీటి రంగాను హత్య చేసిన ఘటనలో మీ హస్తం లేదా. సనాతన ధర్మం పేరు చెప్పిన పవన్ కళ్యాణ్ దేవాలయంలో టీడీపీ మీటింగ్ పెడితే ఎందుకు మాట్లాడడం లేదు. జగన్ ఇచ్చినవి కాక మేము ఎక్కువగా ఇస్తామని చెప్పి ఒక్కటి కూడా ఇవ్వలేదు. అభివృద్ధి,సుపరిపాలన,మిగతా అంశాల పై జగన్ డిబేట్ కు రావాలని లోకేష్ అడిగారు. జగన్ కు ఉన్న సబ్జెక్ట్ లో లోకేష్ కు ఇసుమంతైనా లేదు. రెండు సంవత్సర కాలంలో మీరు ఎన్ని డబ్బులు ఇచ్చారో లోకేష్ చెప్పగలరా. జగన్ పాలన గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు. మా పార్టీ సమన్య కార్యకర్త కూడా లోకేష్ తో డిబేట్ కు రెడీగా ఉంటారు. అలీఖాన్ తన పై చేసిన వ్యాఖ్యలను లైట్ తీసుకున్నాం. క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి నాకు అధికారం లేదు.




