Srisailam: శ్రీశైలంలో వైభవంగా శ్రీ భ్రమరాంబ దేవికి లక్షకుంకుమార్చన!
Srisailam: శ్రీశైలం క్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా శ్రీ భ్రమరాంబ దేవికి లక్షకుంకుమార్చన వైభవంగా జరిగింది. పరోక్ష సేవ ద్వారా దేశవిదేశాల నుంచి భక్తులు పాల్గొని అమ్మవారిని పూజించారు.
Srisailam: శ్రీశైలంలో వైభవంగా శ్రీ భ్రమరాంబ దేవికి లక్షకుంకుమార్చన!
Srisailam: పౌర్ణమి సందర్భంగా శ్రీ భ్రమరాంబ దేవికి లక్షకుంకుమార్చన జరిపించారు. ఈ లక్షకుంకుమార్చనలో భక్తులు పరోక్షసేవగా పాల్గొనే అవకాశం కూడా కల్పించబడింది.
కాగా గురువారం 45 మంది భక్తులు పరోక్షసేవగా ఈ కుంకుమార్చనను జరిపించుకున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, అస్సాము, ఒడిస్సా, హర్యానా, చత్తీష్‌ఘడ్, తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ పూజలను నిర్వహించుకున్నారు. అలాగే జర్మని నుంచి కూడా ప్రవాసభారతీయులు ఈ పూజలను నిర్వహించుకుంటున్నారు.
కాగా లక్షకుంకుమార్చనలో ముందుగా పూజాసంకల్పం పఠించబడుతుంది. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజను నిర్వహించడం జరుగుతుంది. అనంతరం లక్షకుంకుమార్చన జరిపించబడుతుంది.
కాగా మంగళకరమైన ద్రవ్యాలలో కుంకుమకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఈ కుంకుమ ద్రవ్యముతో అమ్మవారిని అర్చించడం విశేష ఫలదాయకమని పండితులు పేర్కొంటున్నారు.
ఈ లక్షకుంకుమార్చన జరిపించుకోవడం వలన కష్టాలు తొలగిపోతాయని, సర్వశుభాలు కలుగుతాయని, అభీష్టాలు సిద్ధిస్తాయని, సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని, సంసారం వృద్ధిలోకి వస్తుందని, సంతాన సౌఖ్యం కలుగుతుందని, పూర్వజన్మదోషాలు తొలగిపోతాయని చెప్పబడుతోంది.
కాగా శ్రీశైలక్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా ఆర్జితసేవలను పరోక్షంగా జరిపించుకునేందుకువీలుగా దేవస్థానం ఈ ఆర్జితపరోక్షసేవను నిర్వహిస్తోంది.
ఈ పరోక్షసేవకు భక్తులు మనమిత్ర వాట్సాప్ నెంబరును 9552300009 లేదా ఏ.పి.టి.ఎస్ వారి వెబ్‌సైట్ www.tms.ap.gov.in ద్వారా రూ.1,116/-లను సేవారుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇతర వివరములకు దేవస్థానం సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు 83339 01351 / 52 / 53 లను సంప్రదించవచ్చును




