Markapuram: లబ్ధిదారులతో మమేకమైన కలెక్టర్ విజయ సునీత పింఛన్ల పంపిణీ!
Markapuram: మార్కాపురం పట్టణంలోని నాయుడు వీధిలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పాల్గొన్నారు.
మార్కాపురం: పట్టణంలోని నాయుడు వీధిలో బుధవారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మాట్లాడి వారి సంక్షేమం, ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు.
ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పథకాలు ప్రతి అర్హుడికి పారదర్శకంగా చేరేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
పెన్షన్ పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొని పెన్షన్ల పంపిణీని పర్యవేక్షించారు.
లబ్ధిదారులు ప్రభుత్వం అందిస్తున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.




