Yemmiganur: ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్‌గా పోటీకి సిద్ధం మాచాని సోమనాథ్!
Yemmiganur: ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్‌గా పోటీ చేసేందుకు సిద్ధమన్న టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచాని సోమనాథ్. బీసీలకు 34% రిజర్వేషన్లపై హర్షం.
Yemmiganur: ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్‌గా పోటీకి సిద్ధం మాచాని సోమనాథ్!
Yemmiganur: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో స్థానిక ఎన్నికలపై రాజకీయ ఆసక్తి నెలకొంటోంది. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మిగనూరు మున్సిపల్ చైర్మన్‌గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచాని సోమనాథ్ అన్నారు. బీసీలకు పార్టీ పరంగా 34 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించే దిశగా నిర్ణయం తీసుకున్నందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, క్యాబినెట్ మంత్రులకు, పార్టీ పెద్దలకు బీసీ సామాజిక వర్గం తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు అండగా నిలుస్తోందని మాచని సోమనాథ్ పేర్కొన్నారు. తన తాత మాచాని శివన్న 40 ఏళ్లపాటు పంచాయతీ అధ్యక్షుడిగా, మున్సిపల్ చైర్మన్‌గా నిజాయితీగా ప్రజలకు సేవలందించారని గుర్తుచేశారు. ఆయన వారసుడిగా తాత అడుగుజాడల్లో నడుస్తూ ఎమ్మిగనూరు పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తానని డాక్టర్ మాచాని సోమనాథ్ స్పష్టం చేశారు.




