Yemmiganur: ఎమ్మిగనూరులో ఉచిత మెగా వైద్య శిబిరం
Yemmiganur: కర్నూలు ఎమ్మిగనూరు పట్టణంలో మాచాని సోమప్ప మెమోరియల్ ట్రస్ట్, జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
Yemmiganur: ఎమ్మిగనూరులో ఉచిత మెగా వైద్య శిబిరం
కర్నూలు: ఎమ్మిగనూరు పట్టణంలోని ఉన్నటువంటి మాచాని సోమప్ప మెమోరియల్ ట్రస్ట్,జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జెమ్ కేర్ హాస్పిటల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ నజీమ్ మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రూ 3 వేల విలువచేసే ఉచితంగా ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఈసిజీ, రక్త పరీక్ష, ఊపిరితి త్తుల పరీక్షలు ఉంటాయన్నారు.
ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సర్ వంటివి బయటపడితే రోగులు ముందు జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. తమ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ, 40 రకాల హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీల కవరేజ్ ఉంటుందన్నారు. కర్నూల్ నందు తమ వైద్యశాలలో క్యాన్సర్ వ్యాధికి వైద్య చికిత్సలు ఉన్నాయన్నారు.
అనంతరం చారిటబుల్ ట్రస్ట్ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ మాచాని సోమనాథ్ మాట్లాడుతూ చాలా ఏళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని రక్తదాన శిబిరాలు ఉచిత పుస్తకాల పంపిణీ ఉపకార వేతనాలను అందిస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ ఏడాది ఉచిత మెగ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది చంద్రశేఖర్, ప్ర శాంత్, శ్వేత, శశికళ, ట్రస్ట్ మెంబర్లు, గ్రామాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




